దీపావళి వేడుకలకు అయోధ్య నగరం ముస్తాబైంది. పండుగ రోజు 25 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్య సరయూ నదీ తీరంలో ‘దీపోత్సవ్’ నిర్వహిస్తారు. ఈసారి కూడా వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 51 ఘాట్‌లలో ఒకేసారి 25 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు.
శనివారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. సరయూ హారతి ఇవ్వనున్నారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవ్ ప్రారంభిస్తారు. మొత్తం 25 వేల మంది వాలంటీర్లు ఒకేసారి 25 లక్షల దీపాలను వెలిగించనుండగా.. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరుకానున్నారు. దీపోత్సవ్ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు.Ayodhya eyes new World record on deepotsav