అద్భుతంగా అయెధ్య ఆలయం.. ఫొటోలు ఇదిగో

Update: 2023-07-08 17:14 GMT

అయోధ్య రామమందిరం.. ఎన్నో వివాదాల తర్వాత ఆలయ నిర్మాణానికి 2020లో అడుగులు పడ్డాయి. అప్పటినుంచి ఆలయం ఎప్పుడు పూర్తవుతుంది.. శ్రీరాముడిని ఎప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఎదరుచూస్తున్నారు. భక్తుల ఎదురుచూపులను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులను రామమందిర నిర్మాణ కమిటీ వేగవంతం చేసింది. మొదటి అంతస్థు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు కమిటి తెలిపింది. జనవరి 25 నుంచి సాధారణ భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

జనవరి 14 నుంచి 24వరకు ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర చెప్పారు. అయోధ్యలో జరిగే ఈ క్రతువులో ప్రధాని మోడీ పాల్గొంటారు. పది రోజుల పాటు ఈ పూజలు జరుగుతాయని.. ఆ తర్వాత సాధారణ భక్తులు స్వామిరవారిని దర్శించుకోవచ్చని ఇప్పటికే మిశ్రా స్పష్టం చేశారు. గర్భగుడి ప్రధాన ద్వారం బంగారంతో కప్పబడి ఉంటుందని ఆయన చెప్పారు. 161 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరానికి కూడా బంగారు పూత పూయనున్నట్లు వివరించారు. ఇక రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22న జరిగే అవకాశం ఉంది.

రాముడి విగ్రహ తయారీపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను అయోధ్యకు తరలించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తీసుకొచ్చారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.













 


Tags:    

Similar News