Ayodhya Ram Mandir : మళ్లీ మొదలైన అయోధ్య రామాలయ నిర్మాణ పనులు.. ఇంకా ఎన్నిరోజులు పడుతుందో తెలుసా?
(Ayodhya Ram Mandir) ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర ఇటీవలే అట్టహాసంగా జరిగింది. దశాబ్దాల హిందువుల కల సాకారమైంది. జనవరి 22న రామాలయంలో బాలక్ రామ్ ప్రాణప్రతిష్ట జరిగింది. జనవరి 23 నుంచి దర్శనానికి అనుమతిస్తుండగా.. అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు రామయ్యను దర్శనం చేసుకున్నారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తికాకముందే.. ప్రాణప్రతిష్ట నిర్వహించిన విషయం తెలిసిందే. కొంతకాలం నిర్మాణ పనులు నిలిపేసి.. ఆలయాన్ని ప్రారంభించారు. కాగా మళ్లీ ఆలయ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించారు. ఆలయ మొదటి అంతస్తులో నిర్మించబోయే రాముడి దర్బార్ సహా.. రెండో అంతస్తు పనులు మొదలయ్యాయి.
ఈఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ తెలిపింది. రాముడి దర్బార్ తో పాటు.. ఆలయం చుట్టూ 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. కాగా ఆలయానికి దేశ నలుమూల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు.