Ram Mandir Ayodhya new Timings: అయోధ్య దర్శన సమయాల్లో మార్పు
అయోధ్యలో కొలువుదీరిన బాలరామున్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తీవ్ర చలిని కూడా లెక్కచేయకుండా.. లక్షలాది మంది భక్తులు రామయ్య దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖుల అయోధ్య యాత్రను మార్చి నెలకు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఇప్పటికే సూచించారు. తాజాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులకు దర్శన, పూజా సమయాలను కేటాయించేందుకు అవకాశారన్ని కల్పించింది. అందుకు గానూ.. ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. దర్శనానికి మరో గంట సమయాన్ని అదనంగా కేటాయించింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) దర్శన వేళల షెడ్యూల్ ను విడుదల చేసింది.
మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు
ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు
దర్శనం: ఉదయం 7 గంటల నుంచి
భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు
సాయంత్రం హారతి: 7.30 గంటలకు
రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు
శయన హారతి: రాత్రి 10 గంటలకు