Ayodhya Ram Mandir : అయోధ్యకు ప్రపంచంలోనే అతిపెద్ద తాళం..1265 కేజీల లడ్డూ..

Byline :  Krishna
Update: 2024-01-20 13:00 GMT

అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. రామమందిర ప్రారంభోత్సవ క్రతువులతో ఆ ప్రాంతమంతా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఈ నెల 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిందూధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతున్న అధ్యాయం ఇది. ఈ క్రమంలో ఇవాళ కానుకల సమర్పణ క్రతువు నిర్వహించారు. ఇందులో భాగంగా అయోధ్య ఆలయానికి దేశం నలుమూలల నుంచి కానుకలు వెల్లువెత్తాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద తాళం సహా 1265 కిలోల భారీ లడ్డూ ప్రసాదం అయోధ్య రామాలయానికి చేరుకున్నాయి. అలీఘర్‌కు చెందిన సత్య ప్రకాష్ శర్మ 400కిలోల తాళాన్ని అయోధ్య ఆలయానికి అందజేశారు. రూ.1.5 లక్షలు ఖర్చైన ఈ తాళం తయారీకి 6నెలల సమయం పట్టింది. ఈ తాళం పొడవు 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగుల ఉంది. దీనిని ప్రత్యేక వాహనంలో అయోధ్యకు తరలించారు. అక్కడ క్రేన్ సాయంతో కిందకు దించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్‌ రెడ్డి అనే వ్యక్తి 1,265 కిలోల లడ్డూను తయారు చేశారు. దాదాపు 30 మంది 24 గంటల పాటు శ్రమించి ఈ లడ్డూను తయారు చేశారు.

Tags:    

Similar News