Ayodhya Temples Photos: దగదగ మెరుస్తున్న అయోధ్య రామ మందిరం..

Byline :  saichand
Update: 2024-01-08 12:14 GMT

అద్భుత శిల్ప కళతో రూపుదిద్దికున్నా రామమందిర నిర్మాణ చిత్రాలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం విడుదల చేసింది.




 


ఈ అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఆలయ ప్రాంగణం రాత్రి సమయంలో ధగధగ మెరిసిపోతుంది




 


జనవరి 22న అయోధ్య రామ మందిరంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమం జరగనుంది. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది




 


సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామమందిర సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పుతో 161 అడుగుల ఎత్తుకు ఉంటుంది.




 


ఆలయ నిర్మాణం 392 స్తంభాలు.. 44 ద్వారాలతో ఆకట్టుకునే అమరికతో అలంకరించబడ్డాయి. ఇవి ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తులో అంతస్తులతో సమానంగా ఉంటుంది.




 


పవిత్రోత్సవానికి ప్రముఖలు హజరుకానున్నారు. ఆలయ ట్రస్ట్ అతిథి జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీలు 7,000 మందికి పైగా అతిథిలు ఈ జాబితాలో ఉన్నారు.




 


అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ తెలిపారు. విశాలమైన ఆలయ సముదాయంలో ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయి.

Tags:    

Similar News