తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను విమర్శిస్తూ.. మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రబ్బర్ స్టాంప్ గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్ కు నచ్చుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళ.. పైగా గవర్నర్ ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సరైన పద్దతికాదని సూచించారు.
గవర్నర్ ను అవమానిచడం బీఆర్ఎస్ హాబీగా పెట్టుకుందని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను హేళన చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని బండి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను చూస్తూ గవర్నర్ ఊరుకోవాలా? ప్రశ్నిస్తే తప్పా? అని అన్నారు. సీఎం అందుబాటులో లేడని.. ప్రజలు రాజభవన్ వైపు చూస్తున్నారని చెప్పారు.