ఇంట్లో వండుకోవడమంటే బద్దకం అనుకునేవాళ్లకు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వైపు ఓ కన్నేస్తారు. దీంతో ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ కూడా భారీగా పెరిగిపోయింది. రకరకాల ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా బెంగళూరు కస్టమర్ కు ఓ అనుకోని అతిథి తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్ లో వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో షవర్మా ఆర్డర్ పెట్టాడు. అది రాగానే ఆత్రుతగా.. దాన్ని తిందామని ఓపెన్ చేసి సగం తిన్నాడు. ఇక అంతే ఒక్కసారిగా షాక్ తిని.. దాన్ని పక్కకు విసిరేశాడు.
షవర్మా కర్రీలో చిన్న ఇనుప ముక్క వచ్చింది. దాంతో దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ విషయంపై స్విగ్గీకి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే తన కంప్లైంట్ పై స్విగ్గీ సపోర్ట్ ఏజెంట్ శ్రద్ధ చూపడంలేదని అతను ఆరోపిస్తున్నాడు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.