బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..11 రోజులు మూత

Update: 2024-01-28 15:25 GMT

బ్యాంకు ఖాతా అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమైనది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు లావాదేవీలు చేసినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అవసరమైన రోజుల్లో బ్యాంకులు మూతపడితే చాలా వరకూ ఇబ్బందులు తలెత్తవచ్చు. దానివల్ల కొన్ని కొన్ని పనులు కూడా వాయిదా పడొచ్చు. అందుకే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం ఎంతో మంచిది.

మరో మూడు రోజుల్లో జనవరి నెల పూర్తవుతుంది. దీంతో ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల మేరకు ఫిబ్రవరి నెలలో దాదాపు 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందులో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులన్న విషయం అందరికీ తెలిసిందే.

ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులివే:

ఫిబ్రవరి 4 - ఆదివారం

ఫిబ్రవరి 10 - రెండో శనివారం

ఫిబ్రవరి 11 - ఆదివారం

ఫిబ్ర‌వ‌రి 14 - వసంత పంచమి (త్రిపుర, ఒడిశా, భువనేశ్వర్, ప‌శ్చిమ‌బెంగాల్‌లో సెలవు)

ఫిబ్రవరి 15 - లూ-ఎన్​గై ని- (ఇంఫాల్​లో సెలవు)

ఫిబ్రవరి 18 - ఆదివారం

ఫిబ్రవరి 19 - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (బేలాపూర్, ముంబై, నాగపూర్‌లో సెలవు)

ఫిబ్రవరి 20 - రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం (అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరాంలో సెలవు)

ఫిబ్రవరి 24 - రెండో శనివారం

ఫిబ్రవరి 25 - ఆదివారం

ఫిబ్రవరి 26 - నైకూమ్- (అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌‌లో సెలవు)

Tags:    

Similar News