FASTag KYC:కేవైసీ చేయకపోతే ఇక అంతే.. కేంద్రం హెచ్చరిక

Byline :  Bharath
Update: 2024-01-16 01:39 GMT

టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు కేంద్ర సిద్ధం అయింది. ఫాస్టాగ్ ల ద్వారా టోల్ చార్జ్ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ (KYC) పూర్తిచేసుకోని నిలిపేసేందుకు సిద్ధం అయింది. కేవైసీ చేసుకోని ఫాస్టాలను జనవరి 31 నుంచి బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని NHAI ప్రకటించింది. ఫ్టాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉన్నా.. కేవైసీ చేయకపోతే బ్లాక్ లిస్ట్ లేదా డీయాక్టివేట్ చేస్తారు. అందుకే సేవలు కొనసాగేందుకు ఫాస్టాగ్ కు వెంటనే కేవైసీ చేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం.. టోల్ ప్లాజా లేదా సంబంధింత బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని తెలిపింది.

కొందరు వాహనదారులు ఫాస్టాగ్ ను వెహికల్ ముందు భాగంలో పెట్టకుండా.. ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ అతికిస్తున్నారు. అంతేకాకుండా ఒకే ఫాస్టాగ్ ను అనేక వాహనాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాలో ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తిచేయకుండానే ఫాస్టాగ్ లు జారీ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ‘వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్’ విధానాన్ని చర్యలు చేపట్టింది. 




Tags:    

Similar News