Rahul Gandhi : రాష్ట్రంలో రాహుల్ పర్యటన.. ఇలాంటి పోస్టర్లతో స్వాగతం!!

Byline :  Veerendra Prasad
Update: 2023-11-17 05:02 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రధాన పార్టీల అగ్రనేతలు. ఇందులో భాగంగానే నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. .ఈ తరుణంలో తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ రాహుల్ పర్యటించబోయే ప్రాంతాల్లో బ్యానర్లు. వెలిశాయి. ఎయిర్పోర్ట్ సమీపంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. కాగా ఈ బ్యానర్లు ఏర్పాటు చేసింది ఎవరో తెలియరాలేదు.

ఇవాళ రాహుల్ గాంధీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరీ సభల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 నిమిషాలకు రాహుల్ విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా మణుగూరుకు చేరుకుంటారు. పినపాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుని బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నర్సంపేట నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో పాదయాత్రలో పాల్గొని, అనంతరం సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.


 


Tags:    

Similar News