పడకగదిపై వాస్తు ప్రభావం.. ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు

Byline :  saichand
Update: 2024-01-11 05:12 GMT

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పడకగదిపై శుక్రుని ప్రభావం ఉంటుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా ఒకరినొకరు అన్యోన్యంగా, ప్రేమ, అంకితభావం ఉండేలా బెడ్‌ రూమ్‌ను నిర్మించుకోవాలని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. పడకగది వాస్తు దోషం వైవాహిక జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. మహాదశ, అంతర్దశ గ్రహాలు శని, రాహువులు భార్యాభర్తల బంధంలో గొడువలకు కారణమవుతాయని వాస్తుశాస్త్రం విశ్వసిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడితే గ్రహ పరిస్థితుల నివారణతో పాటు పడకగదిలోని వాస్తు దోషాలను తొలగించే ప్రయత్నం చేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక చైనీస్ వాస్తు శాస్త్ర నిపుణులు ఫెంగ్ షుయ్‌ పడకగదిపై వాస్తు దోషాలు చూపించే ప్రభావాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే దోష నివారణల ఏం చేయాలో కూడా సూచించారు.

పడకగదిలో బెడ్‌పై రెండు వేర్వేరు పరుపులకు బదులుగా ఒకే పరుపును ఉపయోగించాలి. ఇది భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగిస్తుంది.

రెండు దుప్పట్లు ఉండటం వల్ల సంబంధాలలో చీలికకు కారణం అవుతుంది.

పడకగదిలో మహిళలు సవ్య దశలో నిద్రించాలి. పడకగది తలుపు ముందు తల, కాళ్లు పెట్టుకుని పడుకోకూడదు. అది శకునంగా పరిగణించబడుతుంది

ఆకుపచ్చ మొక్కలను పడకగదిలో ఉంచడం మంచిది

పడకగదిలో కాకుండా ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లేదా బాల్కనీలో పచ్చని మొక్కలను ఉంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది

మీ పడకగదిలో పొరపాటున కూడా దేవుని చిత్రాలను పెట్టకండి.

జ్యోతిష శాస్త్రంలో పడకగది శుక్ర గ్రహానికి సంబంధించినది. కాబట్టి, శుక్రుడు ఉన్న చోట, దేవతలు ఉనికిని అంటే అది అశుభంగా పరిగణించబడుతుంది.

Tags:    

Similar News