హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మమతా బెనర్జీకి గాయాలు..

Update: 2023-06-27 12:38 GMT

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండైంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టర్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో మమతాబెనర్జీకి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు చెప్పారు.

మంగళవారం జల్‌పాయ్‌గురి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు మమత హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం దీదీ హెలికాప్టర్లో బాగ్ డోగ్రా బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వర్షాలకు తోడు లో-విజిబిలిటీ కారణంగా సెవోక్ ఎయిర్ బేస్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం సీఎం మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్ డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి కోల్కతాకు బయలుదేరారు. అయితే ఈ ఘటనలో దీదీ స్వల్పంగా గాయపడడ్డారు. మమతకు వీపుభాగంతో పాటు మోకాలికి స్వల్పంగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కోల్కతాలో ఫ్లైట్ దిగిన వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.



Tags:    

Similar News