ఏదో బతుకు తెరువు కోసం.. ఉన్న ఊరు విడిచి చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలంటూ సిటీలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో సొంత ఇల్లు ఉండవు కాబట్టి, అద్దె ఇళ్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి అద్దె ఇంటి కోసం వెతకుతుండగా, అతనికి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు నగరంలో తేజస్వి శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ఆన్‌లైన్ లో అద్దె కోసం ఇల్లు వెతికాడు. అలా వెతుకుతున్న క్రమంలో.. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూడగానే మైండ్ బ్లాంక్ అయింది. అడ్వాన్స్‌కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్‌కు గురి చేసింది. ఆయన ఈ యాడ్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పెట్టారు.
ఆ ఫ్లాట్ లో అద్దెకు దిగాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా యజమానికి 25లక్షలు చెల్లించాలని , ఇందుకోసం లోన్ కూడా అప్లై చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఫ్లాట్ కొంటున్నానా లేక, అద్దెకు తీసుకుంటున్నానా అనే విషయం ఒక్కసారిగా శ్రీ వాస్తవకు అర్ధంకాలేదు. బెంగళూరు సిటీలో ఇల్లు అద్దెకు తీసుకోవడం ఇంత కష్టమా అనుకొని, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ప్లాట్ ధర 25లక్షలు అని చెప్పడంతో పాటు కిడ్నీ కూడా డొనేట్ చేయమంటే సరిపోయేది అంటూ వ్యంగంగా సెటైర్ వేశాడు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది. పాతిక లక్షలు అద్దెంటి అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు లోన్ కోసం అప్లై చేసుకునే ఆప్షన్‌పై మండిపడ్డారు. ఆశకు హద్దుండాలి.. అడగడానికి సిగ్గుండాలని అంటున్నారు. ఇంటి అద్దె నెలకు రెండున్నర లక్షలా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాతిక లక్షలకు ఏకంగా ఓ చిన్నపాటి ఇల్లే కొనుక్కోవచ్చు అని మరి కొందరు , చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
They should add an option:
Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF
— Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023