కర్ణాటక ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయం...బేరాల్లేవని కంటతడి..

Update: 2023-06-28 15:04 GMT

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. విజయం సాధించాక ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. దీనిపై కర్ణాటకలో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తుంటే..రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత హామీతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ఆటోలను పూర్తిగా ఎక్కడం మానేశారు. దీంతో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది.

ఉచిత మహిళలకు ప్రయాణ పథకం అమల్లోకి రావడంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఓ ఆటో డ్రైవర్ కన్నీరు పెట్టుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఉదయం గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటో నడిపినా రూ. 40 కూడా రాలేదని ఆ ఆటో డ్రైవర్ వాపోయాడు. తాము ఎలా బతకాలంటూ కంటతడి పెట్టుకున్నాడు.



Tags:    

Similar News