Bengaluru Blast : బెంగళూరు బాంబు పేలుడులో కీలక పరిణామం.. నిందితుడి గుర్తింపు

Byline :  Krishna
Update: 2024-03-02 03:13 GMT

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుండలహళ్లిలో ఉన్న ఈ కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా కేఫ్‌లో సిబ్బందేనని పోలీసులు తేల్చారు. పేలుడుకు పాల్పడిని నిందితుడిని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీలో నిందితుడి దృశ్యాలు రికార్డైనట్లు డిప్యూటీ సీఎం డీకే తెలిపారు. అతడి వయస్సు 28 నుంచి 30 ఏళ్లు ఉంటాయని చెప్పారు.




 


నిందితుడు 11 గంటలకు హోటల్కు వచ్చినట్లు డీకే తెలిపారు. ఈ క్రమంలో సింక్ దగ్గర బ్యాగ్ పెట్టి.. ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు చెప్పారు. అయితే టిఫిన్ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించామని వివరించారు. ఆ తర్వాత గంటకు పేలుడు సంబవించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గాయపడ్డవారిలో ఎవరికి ప్రాణపాయం లేదని చెప్పారు. తక్కువ తీవ్రత ఉండే ఐఈడీ బాంబు పేలుడు జరిపారని.. నిందితుడిని ఎట్టు పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. 


Tags:    

Similar News