రెండేళ్లయినా సంసారం చేయట్లేదు.. వీడు నాకొద్దు.. పోలీసులకు ఫిర్యాదు

Update: 2023-08-17 06:44 GMT

ఎంబీఏ చదువు.. వెంటనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం.. చూడచక్కనైన ఆ యువతికి.. ఐటీ ఇంజనీర్‌తో పెళ్లి అయింది. తనకంటే ఉన్నతోద్యగం చేసే వ్యక్తి భర్తగా లభించడంతో ఆమె ఎంతో ఆనందించింది. పెళ్లి తర్వాత తన జీవితం పూలపాన్పులా ఉంటుందని భావించింది. కానీ.. ఆ మొగుడు.. నిఖార్సయిన మగాడు కాదన్న విషయం చాలా ఆలస్యంగా గ్రహించింది. పెళ్లై రెండేళ్లయినా తనను తాకకపోవడంతో .. అనుమానమొచ్చి నిలదీసింది. అసలు నిజం తెలిశాక కూడా భర్త పెట్టే టార్చర్ భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన భర్త తనతో కాపురం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.




 


కర్ణాటకలోని జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళకు.. 2020 ఆగస్టు 30వ తేదీన ఐటీ ఇంజనీర్ అయిన ఓ వ్యక్తితో వివాహమయ్యింది.పెళ్లికి ముందే ఆమెకు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా రెండేళ్లు ఇన్ఫోసిస్ లోనే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఉద్యోగం చేయొద్దు అంటూ అత్తామామా సతాయిస్తుండడంతో మానేసింది. మరోవైపు పెళ్లే రెండేళ్లు అవుతున్నా.. భర్తతో ఎలాంటి శారీరక సంబంధం లేకపోవడం, పిల్లలు పుట్టడం లేదంటూ బంధువులు, ఇరుగుపొరుగువారు ప్రశ్నించడం ఎక్కువైపోయింది.




 


భర్తతో చర్చించినా పట్టించుకోలేదు. వీటిని తట్టుకోలేక ఆమె కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించింది కానీ అది కూడా విఫలమయింది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె భర్త మొబైల్ ను చూడగా.. అందులో కనిపించిన ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యింది. భర్త మరో పురుషుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలవి. దీని గురించి అతణ్ని నిలదీయగా ఇలాంటి తప్పు మరోసారి చేయనని చెప్పాడు. ఓవైపు తనతో సంసారం చేయకుండా హింసించడం.. ఇంకో పురుషుడితో రాసలీలలతో ఆమె విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇంటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో పెద్దలు కలగజేసుకున్నారు. రాజీకి ప్రయత్నించారు. కానీ, ఇలాంటి ‘గే’ భర్తతో కాపురం చేయడం తనవల్ల కాదని తేల్చి చెప్పింది. ఆమె అలా చెప్పడంతో వేధింపులు మరింత పెరిగాయి. ఇక తట్టుకోలేక ఆమె భర్త, అత్తామామలమీద జ్ఞానభారతి పీఎస్ లో ఫిర్యాదు చేసింది.




Tags:    

Similar News