వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. వీడియో
వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైలులో మంటలు చెలరేగాయి. భోపాల్ నుంచి ఢిల్లీ(Bhopal-Delhi ) వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ-14 కోచ్ బ్యాటరీ బాక్స్ వద్ద మంటలు( Catches Fire) వ్యాపించాయి. ఈ క్రమంలో భయంతో ప్రయాణీకులు పరుగు తీశారు. సోమవారం ఉదయం వందే భారత్ రైలు భోపాల్ నుంచి ఢిల్లీ బయలు దేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత కుర్వాయ్ కేథోరా స్టేషన్ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో, రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయని తెలిపారు.
రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బంధిత తనిఖీలు పూర్తి చేసిన అనంతరం రైలు బయలుదేరుతుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Vande Bharat train from Bhopal to Delhi catches fire today morning at around 7:15am. Was on board but by God’s grace everyone is safe!#VandeBharatExpress #traincatchesfire pic.twitter.com/8k5uHDn7lT
— Nupur Singh (@NupurSiingh) July 17, 2023