ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్కు వరుస షాక్లు.. నిన్న దీదీ, నేడు నితీశ్ కుమార్

By :  Bharath
Update: 2024-01-25 15:20 GMT

ఇండియా కూటమికి బిహార్ ముఖ్యమంత్రి షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తును నితీశ్ కుమార్ వదిలేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి బైబై చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నితీశ్ కుమార్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 29 నుంచి బిహార్‌లో ప్రారంభం కాబోయే భారత్‌ జోడో న్యాయ్ యాత్రకు నితీశ్ కుమార్ హాజరు కాబోరని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ వార్త ఆయన ఇండియా కూటమికి దూరం అవుతారనే దానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

నితీశ్ కుమార్ ఇండియా కూటమి ఏర్పడటంతో ముఖ్య పాత్ర పోషించారు. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కూటమి సారథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎంచుకున్నారు. దీనిపై నితీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కూటమి నేతలు.. నితీశ్ కుమార్ ను కన్వీనర్ పదవి చేపట్టాలని ఒప్పించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. అంతేకుండా ఎన్నికలు సమీపిస్తున్నా.. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో కూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన బీజేపీ ముఖ్యనేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Bihar CM Nitish Kumar to withdraw from India alliance

India alliance,Bihar CM Nitish Kumar,Nitish Kumar to withdraw from India alliance,Nitish Kumar return to BJP,nda,Telugu News,Politics News,Congress,rahul gandhi,rahul jodo nyay yatra,Nitish Kumar good bye to INDIA

Tags:    

Similar News