రాముడు ప్రతి చోట ఉంటే గుడి ఎందుకు..? బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. జనం గాయపడితే గుడికి వెళ్తారా? లేక హాస్పిటల్కు వెళ్తారా? అని ప్రశ్నించారు. చదువుకొని సమాజంలో ఉన్నత ఉద్యోగం పొందాలన్నా, ఎంపీ, ఎమ్మెల్యే కావాలన్నా గుడికి వెళ్తారా లేక బడికి వెళ్తారా అంటూ సావిత్రిబాయి పూలే చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. కపట హిందుత్వx, అబద్ధపూరితమైన జాతీయవాదం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రశేఖర్ సూచించారు. ప్రతి చోట, ప్రతి ఒక్కరిలో రాముడు ఉన్నప్పుడు ఆయనను చూసేందుకు వేరే చోటకు వెళ్లాల్లిసన అవసరం ఏంముందని అన్నారు.
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఓవైపు ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ప్రతిపక్షాలు, పలు రాష్ట్రాల నేతలు బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ పావుగా వాడుకొంటుందని విమర్శలు చేస్తున్నాయి. కొందరు రాజకీయ ప్రముఖలకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం పంపకపోవడంపై మండిపడుతున్నాయి.
#WATCH | Bihar Education Minister Chandra Shekhar says, "If you get injured, where will you go? Temple or hospital? If you want education and want to become an officer, MLA, or MP, will you go to a temple or school? Fateh Bahadur Singh (RJD MLA) said the same thing that had been… pic.twitter.com/4Vz3xFDaZc
— ANI (@ANI) January 8, 2024