స్కూల్లో సౌలతులు కావాలని అడిగితే.. పోలీసులు కొట్టారు

By :  Bharath
Update: 2023-09-12 13:07 GMT

విద్యార్థినులు తిరగబడ్డారు. తమ సమస్యలు లేవనెత్తితే పట్టించుకోవట్లేదని ఆగ్రహించారు. కారును ధ్వంసం చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. తమ హక్కులను, అవసరాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ లోని వైశాలి జిల్లాలోని మహనార్ బ్లాక్ లో జరిగిందీ ఘటన. ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ లో సౌలతులు, బెంచీలు, క్లాస్ రూమ్ లు సరిగా లేవని విద్యాశాఖ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. అయినా ఏం లాభం లేకపోయింది. దాంతో స్కూల్ విద్యార్థినులంతా కలిసి మంగళవారం నిరసనకు దిగారు. వెనక్కకు తగ్గాలని టీచర్లు ఎంత చెప్పినా వినకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థినులకు చెదరగొట్టేందుకు కొందరు లేడీ పోలీసులు స్టూడెంట్స్ పై లాఠీ చార్జి చేశారు. దాంతో ఆగ్రహించిన స్టూడెంట్స్.. పోలీస్ కారుపై దాడి చేశారు. కుర్చీలు, కర్రలతో అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనతో మదన్ చౌక్ ప్రధాన రహదారి దిగ్భందం అయింది. పోలీస్ అధికారి చేయి చేసుకున్న తర్వాతే తాము ఈ విధ్వంసానికి పాల్పడ్డామని, తమ సమస్యలు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.


Tags:    

Similar News