పార్లమెంటులో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పెట్టిన కేంద్రం.. విపక్షాల ఆందోళన

Update: 2023-08-01 11:29 GMT



ఢిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ అధికారులు, సేవలపై ఎవరి పెత్తనం ఉండాలనే అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టే లక్ష్యంతో మోడీ సర్కారు ఈ బిల్లు తెచ్చింది. కేంద్రం బిల్లు పెట్టడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని మండిపడుతున్నాయి.

ఢిల్లీలో అధికారులు, సర్వీసులపై అధికారానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దాన్ని చట్టబద్ధం చేసేందుకు వీలుగా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్ మెంట్ బిల్లు 2023ని లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై నిబంధనలను రూపొందించేందుకు కేంద్రానికి అధికారం ఇస్తుంది. దేశ రాజధానిలో అధికారుల సస్పెన్షన్‌లు, విచారణలు తదితర చర్యలు కూడా కేంద్రం నియంత్రణలో ఉంటాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఢిల్లీలోని బ్యూరోక్రాట్లపై లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర నియంత్రణలోకి వస్తుంది.

ఆమ్ ఆద్మీతో పాటు కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే సహా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలన్నీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ఉందని విమర్శఇస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పలువురు విపక్ష ఎంపీలు ప్రకటించారు. అవిశ్వాసం పెండింగ్ లో ఉండగా ఇతర అంశాలపై చర్చలు చేపట్టకూడదన్న సంప్రదాయాన్ని కూడా కేంద్రం ఉల్లంఘించిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

Bill to replace ordinance for control of services in Delhi introduced in Lok Sabha

national,national news,parliament,lok sabha,delhi ordinance,constitution,modi government,Government of National Capital Territory of Delhi (Amendment) Bill,Delhi Lieutenant Governor,administrative services

Tags:    

Similar News