సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్లి..భర్తకు నిప్పు పెట్టిన భార్య

Update: 2023-06-13 03:06 GMT

బీహార్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా భర్త ప్రాణాలనే బలి కోరింది భార్య. సెల్ఫీ దిగుదామంటూ భర్తకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లిన భార్య అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా చంపే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గ్రామస్తులు సంఘట స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

బీహార్‎లోని ముజఫర్‎పుర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. జిల్లాలోని వాసుదేవ్‎పుర్ సరాయ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్తను హతమార్చే ప్లాన్ వేసింది. సెల్ఫీ దిగుదామని చెప్పి మహిళ తన భర్తను శనివారం రాత్రి ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. ఆ తరువాత అతడిని చెట్టుకు కట్టేసింది. నోట్లో గుడ్డలు కుక్కి కిరోసిన పోసి అతడికి నిప్పు అంటించింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. గ్రామంలో వేరొకరితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితురాలు పోలీసులు అదుపులో ఉంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. భర్త పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. 

Tags:    

Similar News