Raghunandan Rao : ఎంపీగా పోటీ చేస్తా.. బీజేపీ నేత రఘునందన్ రావు

Update: 2023-12-12 12:04 GMT

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని అన్నారు. ఒక వేళ పార్టీ ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి గానీ.. లేకుంటే మెదక్ నుంచైనా సరే ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. ఇక దుబ్బాకలో ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడానికి అప్పటి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అధికారులు, పోలీసుల అండతో బీఆర్ఎస్ అభ్యర్థి విచ్చలవిడిగా డబ్బు పంచారని ఆరోపించారు. సీపీకి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ కేడర్ తన కోసం శాయశక్తులా కష్టపడిందని అన్నారు. కాగా 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1118 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్ తో కలిసి అనేక ప్రజా సమస్యలపై గళం వినిపించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందర్ రావు ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నాయకులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కూడా ఓటమిపాలు చెందారు.




Tags:    

Similar News