BJP MP Demand: ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ సంచలన ఆరోపణలు.. సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్ నేత శశిథరూర్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫొటోల్లో మోయిత్రా సిగరెట్, షాంపైన్ తాగుతున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఆమె శశిథరూర్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో బీజేపీ ఐటీ సెల్ పాత్ర ఉందని మహువా మోయిత్రా ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్ క్రాపింగ్ చేసిన ఫొటోలకు బదులు.. పూర్తి ఫొటోలను అప్లోడ్ చేస్తే బాగుండేదన్నారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు బదులిస్తూ.. తాను సిగరెట్ తాగనని, అదంటే తనకు అలర్జీ అని ఆమె స్పష్టం చేశారు. కేవలం స్నేహితులతో ఉన్నప్పుడు మాత్రమే సరదాగా ఫోజులిస్తానని తెలిపారు.
మరోవైపు, మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సంచలన ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఆమెపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మహువా... ఎలాంటి దర్యాప్తునైనా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది.
Whats cooking between Shashi Tharoor and Mahua Moitra?? 😉😂🍻🍸 #HaramiMahua #ShashiTharoor #MahuaMoitra pic.twitter.com/wg10lxM3EJ
— Rosy (@rose_k01) October 14, 2023