మురో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, మోదీ హైట్రిక్ ప్రధాని కావాలని.. అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తాజాగా ప్రత్యేక ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఆజంగఢ్ ఎంపీ, భోజ్ పురి సినీ నటుడు దినేష్ లాల్ యాదవ్ నారాహువా.. రూపొందించిన ఈ పాటను అధికారికంగా లాంచ్ చేశారు. ‘ఫిర్ ఆయేగా మోదీ (మోదీ తిరిగొస్తాడు)’ పేరుతో రూపొందించిన ఈ పాటలో... ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన పథకాలు, మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్ సాధించిన ఘనతలను ప్రస్తావించారు.
వందే భారత్ రైళ్లు, నూతన పార్లమెంట్ భవనం, ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విశేషాలను ఈ పాట వీడియోలో చూపించారు. ‘బీజేపీ సాధించిన ఘనతలతో ఢంకా మోగిద్దాం. శ్రీరాముడి దీవెనలతో మోదీ మళ్లీ వస్తారు. ఆయన ఓ వ్యక్తి కాదు.. దేశం గర్విస్తున్న శక్తి’ అని రాసుకొచ్చారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిని బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా మెజారిటీని సాధించాలని చూస్తుంది.
बजेगा डंका, काम के दम का!
— BJP (@BJP4India) December 28, 2023
राम जी देंगे सद्बुद्धि, फिर आएगा मोदी।
मोदी एक व्यक्ति नहीं है, देश का है वो सम्मान,
140 करोड़ लोगों की आशाओं की है पहचान।
फिर आएगा, फिर आएगा मोदी। pic.twitter.com/mcdTElq2ru