బీజేపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నర్సాపూర్ టికెట్ను మురళీ యాదవ్కు ఇవ్వడంతో.. గోపి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో అసమ్మతి నేతలతో సమావేశమై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్పై సంచలన ఆరోపణలు చేశారు. కులాల పేరుతో ఈటల రాజేందర్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు.
బీజేపీలోకి కొత్త వాళ్లు వచ్చిన తర్వాత పార్టీ కలుషితమైందని గోపీ ఆరోపించారు. కుట్ర పూరితంగానే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని.. పార్టీ కోసం కష్టపడే వారికి బీజేపీలో ప్రాధాన్యత లేదని వాపోయారు. బీజేపీకి రాజీనామా చేయాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సీట్లను అమ్ముకున్న వారిపై పార్టీ హైకమాండ్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.