బీజేపీలో చేరాలని ఒత్తడి చేస్తున్నారు : Arvind Kejriwal

Update: 2024-02-04 10:34 GMT

బీజేపీ(BJP)లో చేరాలని ఆ పార్టీ నేతలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకోసం కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వారు ఎన్ని కుట్రలు చేసిన నేను స్థిరంగా ఉండదలచుకున్నాని కేజ్రీవాల్ (Kejriwal) తెలిపారు. వారి ఒత్తిళ్లకు లొంగన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరితే ఫ్రీగా వదిలేస్తారట. కానీ నేను ఎప్పుడు వారితో కలవను అని బీజేపీకి ఆయన తేల్చిచెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణల కేసులో ఢిల్లీ మంత్రి అతిషికి నోటీసులు అందించేందుకు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు (Crime Branch Police) ఆమె నివాసానికి వెళ్లారు. తాము వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో లేరని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

ఆమెకు నోటీసులు అందజేయడానికి మరోసారి వస్తామని చెప్పారు. కాగా పోలీసులు తీసుకొచ్చిన నోటీసులను తన కార్యాలయ సిబ్బందికి అందించాలని అతిషి చెప్పినా.. అందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా సీఎం కేజ్రీవాల్‌కు కూడా ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసులు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశించారు. కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన ఆప్‌ ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని తెలిపారు. కాగా, ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జనవరి 27న అతిషి(Atishi), కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ కూడా ఆఫర్‌ చేసినట్లు తెలిపారు. దాంతో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags:    

Similar News