IND vs PAK: పెళ్లి పీటలపై నుంచి నేరుగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కు

Byline :  Bharath
Update: 2023-09-02 13:01 GMT

మెగా టోర్నీలంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసేది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. దయాదులు గ్రౌండ్ లో పారాడుతుంటే.. స్టేడియంలో ఫ్యాన్స్ టెన్షన్ తో ఊగిపోతుంటారు. మ్యాచ్ ఏ దేశంలో జరిగినా టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో ఓ జంట క్రికెట్ పై అభిమానాన్ని ఇలా చాటుకుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు పెళ్లి పీటలపై నుంచి లేచి స్టేడియానికి వచ్చింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఈ వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అమీ తుమిగా మొదలైనా మ్యాచ్ లో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (11), కోహ్లీ (4), శ్రేయస్ (14), గిల్ (10) నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అఫ్రిది, రౌఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (38,50 బంతుల్లో), ఇషాన్ కిషన్ (56,61 బంతుల్లో) ఇన్నింగ్స్ న ముందకు తీసుకెళ్తున్నారు.




 






 




 




Tags:    

Similar News