భారత్-పాక్ సరిహద్దుల్లో వరద.. ప్రాణాలకు తెగించి గస్తీ కాస్తున్న జవాన్లు

Update: 2023-08-20 15:28 GMT

ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో సట్లెజ్ నదికి వరద తాకిడి పెరిగింది. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో ఏకంగా వంద గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. దాంతో ఈ వరద ప్రభావం ఫిరోజ్ పుర్ జిల్లాలో ఉన్న భారత్-పాక్ సరిహద్దుల పైనా పడింది. వరద నీటిలో బీఎస్ఎఫ్ ఓట్ పోస్టులతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్ కూడా మునిగిపోయింది. దీంతో భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి మరీ బార్డర్ లో గస్తీ కాస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ‘జవాన్లు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ.. తమ వ్యక్తి గత భద్రతను పక్కనబెట్టి కాపాలా కాస్తున్నారు. మోటార్ బోట్ల సాయంతో నిఘా కొనసాగిస్తున్నార’ని అధికారులు తెలిపారు.

BSF jawans patrolling in floods in Punjab region

International Border,Punjab Floods,BSF,Sutlej Floods,Border Security Force,Indo-Pak border,Firozpur,BSF jawans patrolling,BSF jawans patrolling in floods

Tags:    

Similar News