అమ్మాయికి ఒంట్లో బాలేదని ఆస్పత్రికి.. ఐదుగురు మృతి

హాస్పిటల్‌కు వెళ్తుండగా విషాదం.. ఆ కుటుంబంలో..;

By :  Lenin
Update: 2023-07-24 05:10 GMT


వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గంట పాటు సహాయక చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేవర్ బ్యారేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా కస్గంజ్‌లోని గంజ్‌దుండ్వారా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా ఓ అమ్మాయికి చికిత్స చేయించడానికి ఎటాకు వస్తున్నారని.. మార్గమధ్యలో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

యూపీలోనే జరిగిన మరో ఘటనలో అతి వేగంతో అదుపు తప్పిన లారీ అదుపు తప్పి.. బస్‌స్టేషన్‌ ముందు నిలబడి ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో వీధి వ్యాపారులు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిని అభిషేక్‌, ఆకాశ్‌, అఫ్జల్‌గా గుర్తించారు. అభిషేక్‌, ఆకాశ్‌ బస్‌స్టాండ్‌ దగ్గర ఐస్‌క్రీమ్‌ వ్యాపారులు కాగా.. అఫ్జల్‌ తన భార్య, కుమారుడితో బస్‌ స్టేషన్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


Tags:    

Similar News