దొంగల్లో వీడో రకం దొంగ...పెద్ద ప్లానింగే

Update: 2023-08-13 12:38 GMT

దొంగతనాలు పలు రకాలు ఉంటాయి. కొందరు మైండ్‌కి పనిచెప్పి స్మార్ట్‎గా దోచేస్తే మరికొందరు మాత్రం కష్టపడి చోరీ చేస్తారు. ఒకప్పుడు దొంగతనాలు అంటే ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్లడం లాంటివి చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం సులభంగా మాయమాటలు చెప్పి అనుకున్నపని చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ నరేష్‎ను ఓ వ్యక్తి బురిడీ కొట్టించి కారుతో పరారయ్యాడు.




 


పూర్తి వివరాలు చూస్తే నరేష్ తన కారును జహీరాబాద్ అడ్డాపై ఉంచి కిరాయికి నడుపుతున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి వచ్చి కారు అద్దెకు మాట్లాడుకున్నాడు. తాను మహారాష్ట్రలో పనిచేసే క్రైమ్ బ్రాంచి పోలీసుగా పరిచయం చేసుకుని, హైదరాబాద్ వెళ్లాలని కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యంలో సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపి లోపలికి కూడా వెళ్లి వచ్చాడు.

అలాగే ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లి ఫోన్ మాట్లాడాడు. దీంతో అతడిని పోలీస్ అని క్యాబ్ డ్రైవర్ నమ్మేశాడు.


 



ఈ క్రమంలో హైదరాబాద్‌కు వస్తుండగా పటాన్ చెరు మండలం రుద్రారం శివారులో ఉన్న ప్యాలెస్ హోటల్ వద్ద ఆపి డ్రైవర్‌ను బిర్యాని తీసుకురమన్నాడు. డ్రైవర్ బిర్యానీకి వెళ్లగా ఆ వ్యక్తి అక్కడి నుంచి కారుతో ఉడాయించాడు. దీంతో బాధితుడు పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు హైదరాబాద్ లో ఉందని సమాచారంతో గాలింపు కొనసాగిస్తున్నారు. జహీరాబాద్ లో నిందితుడు స్టే చేసి హోటల్ కు వెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. అక్కడ ఇచ్చిన ఆధార్ కార్డు ప్రకారం అతడి పేరు

అభినాష్ ప్రకాష్ షిండే అని గుర్తించారు .


Tags:    

Similar News