వేగానికి చిరుత పులి మారుపేరు. కనిపించిన ఏ జంతువైనా ఇట్టే వెటాడేస్తది. ఏ జంతువైనా తన పరుగు ముందు దాసోహం అవాల్సిందే. అన్నింటికంటే జింక లాంటి తేలికైన జీవులను వేటాడటం చిరుతకు మహా సరదా. అమడ దూరంలో చిరుత కనిపించిందంటే చాలు జింక అక్కడి నుండి పరుగో, పరుగో.. కానీ తాజాగా ఓ జింక చిరుతను చూసి ఏమాత్రం భయపడకుండా తన
పనేదో తను చేసుకుంటూ కనిపించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది
ఆ వైరలవుతున్న వీడియోలో ఓ జింక గడ్డి తింటూ.. అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ జింకను చూసి ఓ చిరుత నెమ్మదిగా అక్కడికి వచ్చి దాన్ని తినే ప్రయత్నం చేసింది. కానీ ఆ జింక ఏ మాత్రం భయం లేకుండా లైట్ తీసుకుని తన పనేదో చేసుకుంటూ కనిపించింది. మరి ఇంతకీ ఆ జింకకు అంతా దైర్యం ఎలా వచ్చిందంటే.. చిరుత ఇనుప కంచె అవతల ఉండడం.
ఎలాగూ కంచెను దాటి చిరుత తన దగ్గరకు రాదు అనే ధీమాతో ఆ జింక ప్రశాంతంగా గడ్డి తింటూ ఉండిపోయింది. చిరుత గర్జించిన ఆ జింక అలాగే మిన్నకుండిపోయింది.
ఈ వీడియోను IFS అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ వీడియోను లైక్ చేయగా., వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. "జింక ధైర్యం అమోఘం" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా `జింక చిరుత ఇగోను హర్ట్ చేసింది`అని అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Window shopping by Cheetah… pic.twitter.com/x3p7PvdNS6
— Susanta Nanda (@susantananda3) March 12, 2022