Yamaha bike : యమహా బైక్ కొంటే ‘క్యాసియో జీ-షాక్’ వాచ్ ఫ్రీ.. ఎలాగంటే?

Byline :  Bharath
Update: 2024-02-07 12:24 GMT

యమహా ఎఫ్ జెడ్- ఎక్స్ బైక్ మోడల్ సక్సెస్ ను.. వినియోగదారులతో పంచుకునేందుకు సిద్దమైంది. ఈ బైక్ లో కొత్త కలర్ వేరియంట్.. క్రోమ్ కలర్ ను తీసుకొస్తుంది. దీని ధర రూ.1,39,700 (ఢిల్లీ ఎక్స్ షో రూం) గా యమహా నిర్ణయించింది. కాగా ఈ కొత్త కలర్ వేరియంట్ ను తీసుకొస్తున్న సందర్భంగా.. కస్టమర్ల కోసం యమహా ఆఫర్ ను ప్రకటించింది. ఈ కొత్త కలర్ వేరియంట్ ను మొదట బుక్ చేసిన మొదటి 100 మందికి 'క్యాసియో జీ-షాక్' వాచ్‌ను గిఫ్ట్ గా అందించనున్నట్లు తెలిపింది. అయితే బైక్ అఫీషియల్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

కాగా ఈ బైక్ ను రూ.2000 చెల్లించి ప్రీ బుక్కింగ్స్ చేసుకోవచ్చు. బైక్ కొనుగోలు చేసే టైంలో.. ప్రీ బుక్ కోసం చెల్లించిన డబ్బును అందులో జమ చేస్తారు. బుక్కింగ్స్ ను బట్టి బైక్ డెలివరీ చేయడానికి దాదాపు 25 రోజులు పట్టొచ్చని, స్టాక్ ఆధారంగా.. వీలైనంత వేగంగా బైక్ డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామని యమహా కంపెనీ తెలిపింది. 149సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఎఫ్‌జెడ్-ఎక్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెనక డిస్క్ బ్రేక్, ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఏబీఎస్, మల్టీ ఫంక్షన్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, వెనుక మడ్‌గార్డ్, లోయర్ ఇంజిన్ గార్డ్, బ్లూటూత్ ఎనేబుల్‌డ్ వై-కనెక్ట్ యాప్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ తో బైక్ ను తీసుకొస్తున్నారు. 

Tags:    

Similar News