కారు బ్యానెట్‌పై పోలీసును ఈడ్చుకెళ్లిన యువకుడు.. వీడియో వైరల్
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. వెహికిల్ చెకింగ్ సమయంలో అధికారులకు సహకరించకుండా ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనిఖీల సమయంలో వాహానాన్ని ఆపాలంటూ పోలీసు అధికారిని చేసిన సైగను పట్టించుకోకుండా.. కారు బానెట్‌తో గుద్ది.. బానెట్ పై దాదాపు 300 నుంచి 400 మీటర్ల దూరం లాక్కెళ్లారు. కటార్గాం ప్రాంతంలోని అల్కాపురి ఓవర్‌బ్రిడ్జి కింద జరిగిన ఈ ఘటన.. అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఫుటేజీలో తెల్లటి స్కోడా కారు బానెట్‌పై ఒక పోలీసు అధికారి గట్టిగా పట్టుకుని ఉండడం.. కారు వేగంగా వెళ్తుండడం కనిపిస్తుంది. ఆ తరువాత రోడ్డు సర్కిల్ సమీపంలో కారు స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో, అధికారి కిందపడిపోవడం.. విధుల్లో ఉన్న ఇతర అధికారులు కారును వెంబడించడం ఈ వీడియోలో కనిపిస్తంది.
સુરતમાં નબીરાઓનો આતંક! રાત્રે વાહન ચેકિગ દરમિયાન પોલીસકર્મીને કચડવાનો કરાયો પ્રયાસ#Surat #Gujarat #News pic.twitter.com/TQlOo7beYt
— Zee 24 Kalak (@Zee24Kalak) November 6, 2023
గాయపడిన అధికారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌పై హత్యాయత్నం కింద కాటర్గాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటనకు కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూరత్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఝలా తెలిపిన వివరాల ప్రకారం, కతర్గాం పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం అల్కాపురి వంతెన కింద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని తెల్లటి స్కోడా కారును గుర్తించారు. పోలీస్ అధికారి గౌతమ్ జోషి కారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ బ్రేక్‌లు వేయలేదు. పోలీసును ఈడ్చుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. డ్రైవర్ ను 12వ తరగతి చదువుతున్న హేమ్రాజ్ బధియాగా గుర్తించాం. డ్రైవర్ 300-400 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అతనిని చంపడానికి ప్రయత్నించి.. బానెట్ నుంచి కిందికి పడేయడానికి ప్రయత్నించాడు’’ అని ఏసీపీ తెలిపారు. దీనిమీద తదుపరి విచారణ జరుగుతోంది.