గాలికి ఎదురుగాలి.. ఆస్తుల జప్తుకు సీబీఐ కోర్టు ఆదేశం

Update: 2023-06-14 07:07 GMT


కన్నడ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికు సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాలితో పాటు ఆయన భార్య అరుణ పేరుతో ఉన్న 124 ఆస్తుల్లో 82 ఆస్తులు జప్తు చేసుకోవాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జనార్దనరెడ్డిపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ ఆస్తులను తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని న్యాయస్థానం సీబీఐ అధికారులను ఆదేశించింది. గాలి జనార్థన్ రెడ్డి ఆస్తుల జప్తునకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. దీంతో అప్పటి బీజేపీ సర్కారు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ కోర్టు ఆస్తులు అటాచ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

నిజానికి జనార్దనరెడ్డి దంపతులకు సంబంధించిన 124 ఆస్తుల జప్తు కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం, అవినీతి వ్యతిరేకచట్టం, క్రిమినల్‌ కేసుల సవరణ చట్టానికి అనుగుణంగా వారికి చెందిన 82 ఆస్తుల జప్తునకు ఆదేశించింది. గాలి జనార్థన్ రెడ్డి కర్నాటకతో పాటు తెలంగాణలో ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. అక్రమ గనుల తవ్వకాల ద్వారా ఆర్జించిన సొమ్ముతోనే వీటిని కొన్నట్లు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గత ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను వెల్లడించిన గాలి జనార్దనరెడ్డి తన ‘ఆస్తులను జప్తు చేసినా భయపడననని అన్నారు. జైలులో ఉన్నప్పుడు రూ.1200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తే న్యాయ పోరాటం చేసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నానని చెప్పారు.

ఆస్తుల అటాచ్ నిర్ణయంపై గాలి జనార్థన్ రెడ్డి స్పందించారు. కుటుంబ సమేతంగా దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల ఆలయ సందర్శనకు వెళ్లిన ఆయన దేవుడి ఆశీస్సులతో ఈ వివాదం నుంచి బయటపడతానని అన్నారు. గనుల అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలై బయటకు వచ్చాక గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరుకే పరిమితమయ్యారు 

Tags:    

Similar News