ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అందులో కీలకాంశాలు ఉన్నాయి. సెక్షన్ 337, 338, 304A, సెక్షన్ 153, 154, & 175 రైల్వే చట్టం ప్రకారం సీబీఐ కేసు నమోదు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్ర లేదని.. ఇంకా ఎవరినీ దోషులుగా గుర్తించలేదని ఉంది. ఈ ఎఫ్ఐఆర్పై తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సత్యాన్ని పాతిపెడుతున్నారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని సాకేత్ డిమాండ్ చేశారు. ప్రమాదంపై అశ్వినీ వైష్ణవ్, ప్రధాని మోడీ అన్నీ అబద్దాలే చెప్పారని విమర్శించారు. ‘‘రైల్వే ప్రమాదం వెనుక కుట్ర ఉందని.. దోషులను కూడా గుర్తించామని రైల్వే మంత్రి గతంలో చెప్పారు. కానీ సీబీఐ ఎఫ్ఐఆర్లో అటువంటిదేమి లేదు. దోషులను ఇంకా గుర్తించలేదని ఎఫ్ఐఆర్లో ఉంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని రైల్వే ఎస్ఐ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఒడిశా పోలీసులు కూడా నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. కుట్ర లేదని చెప్పినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది’’ అని సాకేత్ అన్నారు.
కానీ మోడీ ప్రభుత్వం మాత్రం కుట్ర అంటూ అబద్ధాలకు తెరదీశారని సాకేత్ ఆరోపించారు. కుట్రకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేనప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. ఇంటర్‌లాకింగ్ ఫెయిల్యూర్ కారణంగా ట్రైన్స్ క్రాష్ అయ్యే అవకాశం ఉందని సౌత్ వెస్టర్న్ రైల్వే హెచ్చరించిన ఫిబ్రవరి 2023 నాటి లేఖను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఇక ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా.. దాదాపు వెయ్యిమంది గాయాలపాలయ్యారు. ఇంకా 100 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
Important:
— Saket Gokhale (@SaketGokhale) June 7, 2023
CBI FIR in Odisha train crash exposes Modi Govt's SABOTAGE LIE:
Yesterday, CBI filed an FIR & took over the investigation of the Odisha train crash.
What's shocking is that the FIR shows that Modi Govt & @AshwiniVaishnaw are LYING about a conspiracy
👇
(1/6)