సీఈసీ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

By :  Vinitha
Update: 2024-03-10 01:30 GMT

కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించగా వెంటనే ఆమె దాన్ని ఆమోదించారు. తన పదవికాలం మరో మూడేళ్లు ఉండగానే రాజీనామా చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన రాజీనామాకు ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.

గోయెల్‌ 2022 నవంబరు 1న ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబరు వరకూ ఉన్నప్పటికి ఇంతలోనే రాజీనామా చేశారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన ఆయన ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ లో భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే ఉన్నారు. 

Tags:    

Similar News