జూలై 3న కేంద్ర కేబినెట్‌ భేటీ

Update: 2023-06-29 12:52 GMT

జూలై 3న కేంద్రమంత్రి వర్గం భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారు. జూలై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమంతో పాటు..మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కేబినెట్‌ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.




 


ఇక జూన్‌ 28 అర్థరాత్రి మోదీ నేతృత్వంలో బీజేపీ ఆగ్రనేతలు భేటీ అయ్యారు. హోం శాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. సుమారు 5 గంటలపాటు భేటీ కొనసాగింది. లోక్‌సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు మంత్రిమండలిలో మార్పులు గురించి కూడా ఇందులో చర్చించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే కేబినెట్‌లో భారీగా మార్పులు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో పాటు రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చుతారని వార్తలు వస్తున్నాయి. 2024కు సంబంధించిన బీజేపీ తొలిజాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News