PM Kisan-Ritu Bharosa : పీఎం కిసాన్-రైతు భరోసా నిధుల జమపై కేంద్రం అలర్ట్

Byline :  Vamshi
Update: 2024-02-18 11:15 GMT

పీఎం కిసాన్ -రైతు డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా లబ్ధిదారులకు అధికారులు కీలక ప్రకటన చేశారు.ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేల సాయం అందిస్తోంది. రాష్ట్ర సర్కారు మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13,500 అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 22లోపు రైతులంతా ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్ళుగా 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందించనున్నారు. నిర్దేశిత నిబంధనల మేరకు ఈక్రాప్‌ తో పాటు- ఈ కేవైసీ పూర్తి చేసుకన్న రైతులకే పథకం వర్తిస్తోంది.

16వ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈనెల 22 లోపు రైతులంతా ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ వెల్లడించింది. రైతు భరోసా కేంద్రాల వారీగా ఈనెల 11 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 22 లోపు ప్రతి రైతు ఈ క్రాప్‌, ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీకేల్లోని వ్యవసాయశాఖ సహాయకులు ఈ క్రాప్‌, ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం రైతులకు సహకారం అందిస్తున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి- మార్చి మధ్య ఈ విడత సాయం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఇకేవైసీ అందుబాటులో ఉంది. లేదా సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ ఆధారిక కేవైసీ పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు.

Tags:    

Similar News