PANAadhaarLinking : ఆధార్ - పాన్ లింక్ ఫైన్తో కేంద్రానికి భారీ ఆదాయం
(PANAadhaarLinking) గతకొన్ని రోజులుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. కేంద్ర విధించిన గడువులోగా అప్ డేట్ చేయకపోతే.. రూ.1000 చొప్పున అపరాధ రుసుం విధించింది. దీనిద్వారా కేంద్ర ఆర్థిక శాఖకు వచ్చిన ఆదాయాన్ని తాజాగా ప్రకటించారు. గతేడాది జులై 1 నుంచి, 2024 జనవరి 31 వరకు రూ.601.97 కోట్లు వసూలుచేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆధార్-పాన్ అనుసంధానం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలరాయ్.. లోక్ సభలో పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. జనవరి 29, 2024 నాటికి దేశవ్యాప్తంగా 11.48 కోట్ల మంది ఆధార్ పాన్ లింక్ చేసుకోలేదని వివరించారు. గతేడాది జూన్ 30తో గడువు ముగిసింది. కానీ ఫైన్ తో జనవరి 31, 2024 వరకు అప్ డేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా దాదాపు 11 కోట్ల మందికి పైగా లింక్ చేసుకోవాల్సి ఉంది.