India-Maldives row: వచ్చేయండి.. లక్షద్వీప్లో కొత్త ఎయిర్ పోర్ట్.. కేంద్రం పెద్ద ప్లాన్

Byline :  Bharath
Update: 2024-01-09 16:32 GMT

ప్రధానీ మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ దీవుల పేరు ఇప్పుడు మార్మోగుతుంది. భారత్ లోనే సుందరమైన ప్రదేశాలున్నాయని, భారతీయులంతా వాటికి వెళ్లాలని పిలుపునివ్వడంతో.. చాలామంది టూరిస్టుల కన్ను ఇక్కడ పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టూరిస్టులు కూడా మోదీ ఫొటోలకు ఫిదా అయి.. లక్షద్వీప్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా లక్షద్వీప్ లో టూరిజాన్ని డెవలప్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో లక్షద్వీప్ లో కొత్తగా ఎయిర్ పోర్ట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం మినికోయ్‌లో నిర్మాణానికి మొదలుపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.




 


ఫైటర్ జెట్, సైనిక రవాణా ఎయిర్ క్రాఫ్ట్ లతో పాటు.. వాణిజ్య విమానాల కోసం కొత్త ఎయిర్ పోర్ట్ లను నిర్మిస్తుంది. గతంలో కూడా మినికోయ్ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం.. ఎయిర్ ఫోల్డ్ ను నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సముద్రపు దొంగల దాడులు జరుగుతున్న వేళ.. వాటిపై నిఘా ఉంచేందుకు ఈ ప్రాంతం సరైనదని కోస్ట్ గార్డ్ బృధం గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా పౌరు విమానాల రాకపోకలు సాగించేలా కొత్త ఎయిర్ పోర్ట్ ను కట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. లక్షద్వీప్ లో ప్రస్తుతం ఒక్క ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉంది. అది అగత్తిలో ఉంది.




 



Tags:    

Similar News