Z Category Security: కేంద్రం కీలక నిర్ణయం.. జై శంకర్‌కు భద్రత పెంపు..
By : Krishna
Update: 2023-10-12 17:19 GMT
విదేశాంగ మంత్రి జైశంకర్ కు కేంద్రం భద్రత పెంచింది. ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆయనకు వై కేటగిరి భద్రత ఉండేది.. ఇందులోభాగంగా ఢిల్లీ పోలీసులు ఆయన భద్రతను చూస్తుంది. ఇక నుంచి ఆ బాధ్యతలను సీఆర్పీఎఫ్ తీసుకోనుంది. ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంంలో కేంద్రం భద్రతను అప్‌గ్రేడ్ చేసింది.
ఇటీవల కాలంలో పలు ఉగ్రసంస్థల నుంచి ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి జైశంకర్‌కి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం భద్రతను పెంచింది. సీఆర్పీఎఫ్కు చెందిన 14 - 15 మంది సాయుధ కమాండోలు షిఫ్టుల వారీగా 24గంటల భద్రత కల్పిస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా 176 మంది ప్రముఖులు ప్రస్తుతం సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ భద్రత కేటగిరీలో ఉన్నారు.