ఎన్నికల వేళ నగరంలో చికెన్ అమ్మకాలు జోరందుకున్నాయి. కార్తీక మాసం ప్రభావం ఉంటుందని భావించినా.. ఎలక్షన్స్ భలే గిరాకీ ఇస్తున్నాయి. ఈ సమయంలో ధరలు తగ్గడం విశేషం. కొన్నిరోజుల నుంచి కిలో చికెన్ రూ.250 నుంచి రూ.300 పలికిన ధర ఇప్పుడు.. రూ. 150 పలుకుతుంది. డ్రెస్స్డ్ స్కిన్ నేడు రూ. 150కి పడిపోగా.. స్కిన్లెస్ రూ. 170కు అమ్ముతున్నారు. ప్రధాన పార్టీల అంతర్గత కార్యక్రమాలు, క్యాంపు మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసే విందులోనూ నాన్ వెజ్ వడ్డిస్తున్నారు. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా కార్తీక మాసం కావడంతో సామాన్య ప్రజల చెకెన్ కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు అంటున్నారు.