CJI justice d y chandrachud : సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం.. సీజేఐను చూసి షాకైన జనం

Byline :  Kiran
Update: 2023-09-13 11:05 GMT

సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. కాసేపు సరదాగా గడిపారు. కోర్టు ఆవరణలో సరదాగా తిరిగి జర్నలిస్టులతో ముచ్చటించారు. వారి కోరిక మేరకు త్వరలోనే ప్రెస్ లాంజ్కు వస్తానని మాట ఇచ్చారు.




 


ఓ కేసుకు సంబంధించి వాదనలు విన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సడెన్గా బ్రేక్ తీసుకుంది. సీజేఐ తోటి జడ్జిలైన జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కలిసి కాసేపు వాక్ చేశారు. కేఫిటేరియాకు వెళ్లి సమోసా తిని కాఫీ తాగారు.


 



అనంతరం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రానిక్ పాసుల పనితీరును పరిశీలించారు. త్వరలో ఈ పాస్లు ఉన్న వారిని మాత్రమే సుప్రీంకోర్టు ఆవరణలోకి అనుమతించనున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన ఛాంబర్లోకి తిరిగి వెళ్తూ కాసేపు మీడియాతో మాట్లాడారు. సీజేఐ ఇలా బయటకు వచ్చి సరదగా గడపడం చూసిన జనం షాకయ్యారు. 




 




Tags:    

Similar News