నాగ్పూర్లో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్

Update: 2023-06-15 12:29 GMT

టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కువగా మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రకు చెందిన పలువురు ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అక్కడ పలు బహిరంగ సమావేశాలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో నాగ్పూర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.

పార్టీ కార్యాల‌య ప్రారంభోత్సవానికి ముందు బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో ఆయన పాల్గొన్నారు. అనంత‌రం నాగ్‌పూర్ జిల్లా అధ్య‌క్షుడు జ్ఞానేష్ వాకోడ్క‌ర్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. పార్టీ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా నాగపూర్ పట్టణం మొత్తం బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ ఎంపీలు కేశ‌వ‌రావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దానం నాగేంద‌ర్‌, ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, మ‌హారాష్ట‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News