తేజస్వి యాదవ్ పోస్టర్‌ పై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

Update: 2024-02-01 12:07 GMT

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నితీశ్‌కుమార్ బీజేపీ వైపుకు రావడంతో ఈ పదిహేడు నెలల్లో జరిగిన డెవలప్‌మెంట్‌పై జేడీయూ వర్సెస్ ఆర్జెడీగా మాటల యుద్దం సాగుతుంది. ఈ రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి తొమ్మిదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 17 నెలల పాటు సీఎంగా నితీశ్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఉన్నారు. 17 నెలల కాలంలో జరిగిన అభివృద్ధికి మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కారణమని ఆర్జేడీ చెబుతుంటే.. నితీశ్ కుమార్ వల్లే జరిగిందని జేడీయూ (JDU) చెబుతోంది. 17 ఏళ్ల ఎన్డీయే పాలన కంటే గత 17 నెలల మహాఘట్‌బంధన్ పాలన బాగుందని.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి తేజస్వి యాదవ్ కారణమని ఆర్జేడీ అంటోంది. జేడీయూ పోస్టర్లు అంతా బోగస్ అని నితీశ్ కుమార్ విమర్శించారు.

ఆర్జేడీ జేడీయూ మధ్య పోస్టర్లు వార్..

అదంతా చేసింది తామే అన్నారు. ఉద్యోగాల కల్పన కూడా తన ఏడు హామీలు పార్ట్ 2లో భాగంగా అమలు చేసినవే అన్నారు. కానీ ఈ క్రెడిట్ ఇతరులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 నెలల కాలంలో బీహార్ అభివృద్ధి క్రెడిట్‌ను తేజస్వి యాదవ్, ఆర్జేడీ (RJD) తీసుకోవడంపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. అతనో బచ్చా.. అతనికేమీ తెలియదు అని తేజస్వి యాదవ్‌ను ఉద్ధేశించి అన్నారు. 1990 నుంచి 2005 మధ్య లాలూ, ఆయన భార్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సాయంకాలం దాటిందంటే ప్రజలు బయటకు రావాలంటే భయపడేవారన్నారు. కానీ తమ హయాంలో పరిస్థితులు మారినట్లు చెప్పారు.ఈ మేరకు రాష్ట్రంలో పోస్టర్లు వేస్తోంది. 'తేజస్వి యాదవ్ మీకు ధన్యవాదాలు. మీరు చెప్పారు.. మీరు చేశారు.. మీరే చేస్తారు' అంటూ ఆర్జేడీ పోస్టర్లు వేస్తోంది. తేజస్వి యాదవ్ అతిపెద్ద 18 విజయాలు అంటూ ఈ పోస్టర్‌లలో వాటిని పేర్కొంది. వీటిలో 4 లక్షల ఉద్యోగాలు, బీహార్‌(Bihar)లో క్యాస్ట్ సర్వే, 75 శాతానికి రిజర్వేషన్లు, 4 లక్షల కాంట్రాక్ట్ టీచర్లు, నాణ్యమైన విద్య, మెడల్స్ సాధించండి.. ఉద్యోగం పొందండి వంటి పథకం అమలు, టూరిజం పాలసీ, ఐటీ పాలసీ తదితర విజయాలు తేజస్వి యాదవ్ వల్లే సాధ్యమైనట్లు పోస్టర్లలో పేర్కొంది.

Tags:    

Similar News