CM Nitish Kumar : కూటమి కోసం ఎంతో కష్టపడ్డాను.. కానీ.. బిహార్ సీఎం సంచ‌ల‌న కామెంట్స్

Byline :  Krishna
Update: 2024-02-12 12:26 GMT

బీహర్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు. 129 మంది ఎమ్మెల్యేలు నితీశ్కు జై కొట్టారు. ఈ క్రమంలో సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీశ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఇండియా కూటమిలో ఉండడం హస్తం పార్టీకి ఇష్టం లేదన్నారు. కూటమి కోసం ఎంతో కష్టపడ్డానని.. తాను విపక్షాలను ఏకం చేస్తుంటే కాంగ్రెస్ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. లాలూ సైతం తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు.

అంతకుముందు నితీశ్ కుమార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. తమతో బంధాన్ని తెచ్చుకొని జేడీయూ పెద్ద తప్పు చేసిందని అన్నారు. గతంలో జేడీయూ నేతలు బీజేపీని విమర్శించేవాళ్లని, కానీ నేడు వాళ్లే బీజేపీని పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీని తిడితే తప్ప జేడీయూ ఎదగలేదని.. మరి ఇప్పుడు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని నిలదీశారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న నితీశ్.. ఈ ఒక్కసారికే మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని మండిపడ్డారు. ఇక ప్రజల కోసం తమ పదవులు వదులుకున్నామని ప్రజలకు చెబుతామనిన తేజస్వి అన్నారు.

Tags:    

Similar News