వెంటపడుతున్నాడని.. చెప్పుతో చెంపలు వాయించింది

Update: 2023-06-10 08:38 GMT

కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందపురాకులో వెంటపడి వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి చెప్పిందో యువతి. కుందపురాకు చెందిన అమ్మాయి హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తుండగా 35ఏళ్ల వ్యక్తి.. ప్రతిరోజు వెంబడిస్తూ, వేధించేవాడు. ఇంతకాలం ఓపిక పట్టిన ఈ యవతి.. అతన్ని ఎదిరించింది. ఆ వ్యక్తి నిన్న (జూన్ 9) కూడా అలాగే చేయడంతో ఎదురు తిరిగిన ఆమె.. గట్టిగా కేకలు వేసింది.

దాంతో స్థానికులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. ఆ యువతి అందరిముందు అతని చెంపలు వాయించింది. చెప్పుతో తన ముఖంపై కొట్టి తన కోపాన్ని తీర్చుకుంది. చేసేందేం లేక అతను.. వదిలేయాలని వేడుకున్నాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. వేదించిన వ్యక్తిని నజీర్ గా గుర్తించారు పోలీసులు. అతన్ని చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News