Congress Part : గాంధీ కుటుంబం నుంచి పెద్దల సభక వెళ్లే రెండో నేతగా సోనియా
కాంగ్రెస్ (Congress) తరపున రాజ్యసభ(rajya sabha) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను పార్టీ విడుదల చేసింది. అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(soniya gandi) రాజస్థాన్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక బిహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇప్పటికే జైపూర్(jaipur) చేరుకున్న సోనియా గాంధీ..తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అంతకముందు ఎయిర్ పోర్టులో దిగిన ఆమెకి మాజీ సీఎం అశోక్ గహ్లోత్ స్వాగతం పలికారు. నామినేషన్ లో ఆమెతో పాటు రాహుల్, ప్రియంక కూడా ఉన్నారు. ఇంతవరకు లోక్ సభ్యకు ప్రాతినిధ్యం వహించిన ఆమె మొట్ట మొదటిసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయట్లేదని గతంలోనే ఆమె తెలిపారు.
ప్రస్తుతం రాజస్థాన్(rajasthan) నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి సులువుగా గెలవనుండడంతో..ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తుడడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. అయితే గాంధీ కుటుంబం నుంచి పెద్దల సభకు వెళ్లే రెండో నేతగా సోనియా నిలబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజసభ సభ్యురాలిగా వ్యవహరించారు.